MNCL: వేమనపల్లి BJP మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య జరిగి ఇన్ని రోజులైనా దోషులను పట్టుకోకపోవడం శోచనీయమని మాజీ MLA చిన్నయ్య మంగళవారం అన్నారు. స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 48 గంటల టైం ఇచ్చినా కూడా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని విమర్శించారు. ఇంకా ఆలస్యం అయితే కేసులో దోషులు తప్పించుకునే అవకాశం ఉందన్నారు.