ఆదిలాబాద్: ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరుపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు సర్వేను పరిశీలించాలని సూచించారు.