HNK: పరకాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు CPM అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలని CPM జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. పరకాల 2వ వార్డులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, కష్టజీవులకు నష్టం చేసే అనేక చర్యలు చేపడుతుందన్నారు.