కామారెడ్డి: జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నేడు జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల నాయకులు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యే చొరవ చూపకపోవడం శోచనీయమన్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఈనెల 27న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.