JGL: మేడిపల్లి మండలం, కాచారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మైలారం మల్లన్న స్వామి వారి కళ్యాణం బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని బోనం ఎత్తి మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.