WGL: కేయూసీ పరిధిలోని పరిమళ కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు సురేశ్, ఎల్లయ్య అనే ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1,32,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.