KMM: కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి గ్రామ శివారు ఉడతలగూడెం గ్రామంలో బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయానికి గ్రామస్తులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ నిర్మాణ పరిసర ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ అర్చకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.