WGL: ఖిలావరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఈ నెల 16న జరగనున్న కార్తీక సామూహిక వనభోజన కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖను పద్మశాలీ సంఘం ఆహ్వానించింది. ఈ మేరకు శుక్రవారం పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రి నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.