JGL: మెట్పల్లిలోని పలు స్కానింగ్ సెంటర్లను జిల్లా ఉపవైద్యాధికారి జైపాల్ రెడ్డి, RDO శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనల మేరకు స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారా అని పరిశీలించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం ప్రకారం లింగనిర్ధారణ చేసి ఆడ,మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.