HYD: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న సుమారు 300 కిలోల గంజాయిని సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకుని, తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.