SRD: జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను అమీన్ పూర్లో ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ రఘునందన్ రావు శనివారం తెలిపారు. నవోదయ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరాకు వినతి పత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి 500 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలకు 1500 కోట్ల నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.