RR: రంగారెడ్డిలో జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్ బుధవారం మహేశ్వరం మండలం తుక్కుగూడలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు తుక్కుగూడ ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్లో జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన 1200 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీలను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.