SRD: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. ఆదివారం న్యాల్కల్ మండలం ముంగిలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా సర్పంచులు కృషి చేయాలని సూచించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.