NRPT: ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు లేకపోవడం, టీచర్ ఆలస్యం, హాజరు రిజిస్టర్ లోపాలను కలెక్టర్ గమనించారు. అయినా పెద్దగా స్పందించకుండానే వెళ్లడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. కలెక్టర్ ‘చూసి చూడనట్లు’ వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.