RR: చేవెళ్ల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మల్లికార్జున నగర్, విశ్వబ్రాహ్మణ, రెడ్డి కాలనీవాసులు గత కొన్ని రోజులుగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై స్పందించిన మాజీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, PACS ఛైర్మన్ వెంకటరెడ్డి అధికారులతో మాట్లాడి కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించారు. ఈ సందర్భగా లో వోల్టేజ్ సమస్య తీర్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.