NGKL: కల్వకుర్తిలో ఈనెల 22న రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. 10వ రాష్ట్ర క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీల్లో 16-20 ఏళ్ల వయస్సులోపు యువతీ, యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.