HYD: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ నుంచి ఉషా ముళ్ళపూడి ఆసుపత్రి వైపు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టే క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని త్వరలోనే పనులన్నీ పూర్తి చేపడతామని అన్నారు.