VZM: మొన్నటి వరకు కొమరాడ మండలం కుమ్మరిగుంట సమీపంలో సంచరించిన ఏనుగుల గుంపు గురువారానికి అర్తాం అటవీ ప్రాంతానికి చేరుకుంది. అవి వెళ్లే మార్గంలో మొక్కజొన్న, టమాటాతో పాటు ఇతర కూరగాయలు, పత్తి, వరి పంటలను ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల గుంపును అటనీ ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.