VZM: మెరకముడిదాం మండలం గర్భాం, బైరిపురం, పెద మంత్రిపేటకు వెళ్లే రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్థానిక పంచాయతీ నిధులతో నూతనంగా రోడ్ నిర్మాణం చేపట్టారు. దశాబ్దాల నుండి ఈ రోడ్డు గుంతలతొ అస్తవ్యస్తంగా తయారు కావడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి నెలకొనేది. రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.