TG: ఏదో ఒక కేసులో ఇరికించి తనని అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని మాజీమంత్రి KTR అన్నారు. ‘రైతుల గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా వెళ్తాను. కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్. ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేయాలనుకోవటం కుట్ర కాదా? అల్లుడు, అన్న కోసం రైతన్న నోట్లో మట్టికొట్టటం కుట్ర కాదా? బ్యాగులతో దొరికిన దొంగలకు రైతుకష్టం కుట్ర లాగే కనిపిస్తుంది’ అని మండిపడ్డారు.