RR: శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెం.16లో ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది. తమ పట్టా భూమి సున్నం చెరువు FTL పరిధిలో ఉందంటూ హైడ్రా ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నిస్తుందని జూబ్లీహిల్స్‌కు చెందిన అంతిరెడ్డితో పాటు మరో 8 మంది పిటిషన్ దాఖలు చేశారు.