MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం తాండూర్, కన్నెపల్లి మండలాల్లో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు తాండూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం మండల కేంద్రంలో జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కన్నెపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.