NZB: ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బెదిరింపు ధోరణితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుపట్టారు. ఉద్యోగులను అవమానించేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.