NLR: ఉదయగిరిలోనీ ప్రగతి జూనియర్ కళాశాల ఆవరణంలో మంగళవారం చుట్టుపక్కల మండలాల నుంచి 100 మంది పిల్లలకు ఖత్నాలు (ఒడుగులు) నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ.. చిన్న మసీదు కమిటీ వారు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.