SRD: కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రామలయా నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు అయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.