MHBD: మరిపెడ పట్టణ శివారులోని 365వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దేవరశెట్టి కౌసల్య (80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.