సంగారెడ్డి: తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని MLC కవిత ఆరోపించడం సరికాదని, ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మెదక్ MP రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తప్పు చేస్తే KCRను అయినా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుంటాయని చెప్పారు. కేసులకు BJPకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి అందరూ ఉండాలన్నారు.