NRML: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఖానాపూర్ పట్టణంలోని 6, 7, 8 వార్డులలో ఏర్పాటు చేసిన వార్డు సభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఉన్నారు.