MDK: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాపన్నపేట మండలం ఏడుపాయలలో బుధవారం అమ్మవారికి సప్తమి దివాస్ మూల నక్షత్రం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ మేరకు వీణాదారిని సరస్వతీ మాత (కాళరాత్రి) రూపంలో దుర్గమ్మను అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెలుపు రంగులో పట్టు వస్త్రాలు సమర్పించి, పుష్పాలతో అలంకరించారు.