HYD: బాచుపల్లి-మల్లంపేట రోడ్డులో వాహనదారులు నిత్యం నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రి తీవ్రంగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడి ప్రయాణానికి రెండు గంటలు ఆలస్యం అవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.