VZM: వీరఘట్టం మండలం కడకెళ్ళ గ్రామంలోని ప్రభుత్వ ఎంపీయూపీ పాఠశాలలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను మండల ఉపాధి హామీ ఈసీ అధికారి కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. పాఠశాలలకు ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు ద్వారా కాంపౌండ్ వాల్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు.