SKLM: పోలాకి మండలం జొన్నం గ్రామానికి చెందిన బోర శ్రీరామ్ మూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువ నాయకులు, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మంగళవారం ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ రాజేశ్వరరావు, ఎంపీపీ బైరాగి నాయుడు, తదితరులు ఉన్నారు.