VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆమె కూటమి నాయకులతో కలిసి వేపాడ మండలం సోంపురం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులను కలిశారు. రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.