KMM: పేదలకు గుర్తుండిపోయే పథకం ఇందిరమ్మ ఇల్లు అని రఘునాథపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ నాయక్ అన్నారు. రఘునాథపాలెంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి మండలాధ్యక్షుడు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చిందని చెప్పారు. కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు పేదల ప్రభుత్వమేనన్నారు.