ELR: జిల్లాలో ఇద్దరు బీజేపీ నేతలకు కీలక పదవులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏలూరు నగరానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కొయ్యలగూడెంకు చెందిన బొల్లిన నిర్మల కిషోర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.