KMM: మధిర మండలంలో సీజనల్ వ్యాధులను అరికట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి అర్జున్ రావు అన్నారు. శుక్రవారం మాస్ లైన్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ రాంబాబుకు వినతి పత్రం అందించారు. అనేక గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు.