KNR: కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ దేవాలయంలో రెండవ ఆలయమైన శ్రీ మహా సరస్వతి అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. మహాలయ అమావాస్య – ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ మహాశక్తి దేవాలయంలోని శ్రీ మహా సరస్వతి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేశారు. వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.