KNR: ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు కరీంనగర్ మారుతీనగర్‌కు చెందిన రఘు నుంచి రూ.93 వేలు వసూలు చేశారు. రూ.20 వేలు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి పలు విడతలుగా ఈ మొత్తాన్ని స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.