NRML: బైంసా మండల కేంద్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగేష్ మాట్లాడుతూ.. ప్రజలందరూ శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.