KNR: జమ్మికుంట నుంచి ఉ.5 గంటలకు, ఉ.8 గంటలకు, సా.5 గంటలకు హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సులు ఉండేవి. ప్రస్తుతం వాటిని రద్దు చేశారు. హుజురాబాద్ నుంచి హైదరాబాద్కు ఒకటి రెండు బస్సులు మాత్రమే నడుపుతున్నారు. దీంతో జమ్మికుంట నుంచి బస్సులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ వచ్చినప్పుడు హైదరాబాద్ బస్సులు నడపాలని కోరగా స్పందించారు.