SRD: జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ పరీక్షలు మూడు విడతల్లో జరగనున్నట్లు, ప్రతి బ్యాచ్ 25 మంది విద్యార్థుల చొప్పున ఐదు రోజుల పాటు నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలో మాత్రమే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.