NLG: చింతపల్లి మండలం మాల్ బస్ స్టేషన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి 15 రోజులపాటు మాల్ బస్ స్టేషన్ లోకి బస్సులు వెళ్ళవని దేవరకొండ డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మెయిన్ రోడ్డు పైన మాత్రమే బస్సులు నిలుపుతామని పేర్కొన్నారు. మాల్ బస్ స్టేషన్ పరిధిలోని ప్రయాణికులు గమనించి, ఈ అసౌకర్యానికి సహకరించాలన్నారు.