NZB: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ‘MLAకు కనువిప్పు’ పేరుతో నేడు వేల్పూర్‌లో కార్యక్రమం చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని MLA ప్రశాంత్ రెడ్డి విమర్శించడంతో కాంగ్రెస్ నాయకులు దీనిని సవాల్‌గా తీసుకున్నారు.