HYD: నగరంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా, రెరా, జీహెచ్ఎంసీ అధికారులకి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని భావించాలన్నారు.