నారాయణపేట: మక్తల్లో పడమటి అంజన్న జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో కవిత, ధర్మకర్త ప్రాణేష్ చారి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిట్టెం రామ్మోహన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.