ADB: గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలను కోరారు. గ్రహణం నేపథ్యంలో అందరూ కూడా నిమజ్జనం రాత్రి 12 గంటలకు దాటకుండా చూసుకోవాలన్నారు. గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యుత్తు తీగలను సరిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు.