NGKL: గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఎంపీడీవోకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. చాలీచాలని వేతనాలతో గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు స్పందించి వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు.