NZB: అన్నిదానాల్లో అన్నదానం గొప్పదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఎస్జీఎస్ పద్మావతి నిత్య అన్నదాన ఇందూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదలకు నిత్యాన్నదానం చేయడం అభినందనీయమని, ట్రస్ట్‌కు తనవంతుగా రూ.1,01,116 విరాళం అందించినట్లు పేర్కొన్నారు.