KMM: తల్లాడ మండల తహసీల్దార్‌గా టి.కరుణాకర్ రెడి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్ కార్యాలయంలో కొత్త మార్పును తీసుకొస్తానని, ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. దళారుల మాటలను నమ్మొద్దన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.