WNP: వనపర్తి మున్సిపల్ పరిధిలోని తమ మిల్లుకు సంబంధించిన కాంపౌండ్ గోడను పురాధికారులు కూలగొట్టారని యజమాని మారం సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంపౌండ్ గోడకు అనుమతి తీసుకునే విధానం గురించి తెలపాలని అడిగినా పట్టించుకోలేదన్నారు. నాయకులు వ్యక్తిగతంగా తమను వేధిస్తున్నారని, పురకమిషనర్ను పంపించి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.